చరణ్ అండ్ టీమ్ గో టూ బ్యాంకాక్ ట్రిప్ ?

Monday, May 7th, 2018, 12:11:56 PM IST


రంగస్థలం సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ ని బ్యాంకాక్ లో జరగనుంది. ఈ నెల 12 నుండి బ్యాంకాక్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. దాదాపు ఎండు వారాలపాటు అక్కడే షూటింగ్ జరుపుతారట. ఈ రెండు వారాలపాటు చరణ్ అక్కడే ఉంటాడని టాక్. చరణ్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని టాక్. వివేక్ ఒబెరాయ్, స్నేహ లాంటి ప్రధాన తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు పలు రకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి .. కానీ ఫైనల్ లేదన్నది తెలియాల్సి ఉంది.

Comments