తెలుగు రాష్ట్రాలు సహా, ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా దెబ్బకు చరణ్ ర్యాంకు కిందినుంచి టాప్ -5లోకి వచ్చేసింది. సరైన సినిమా పడితే చిరుత హవా ఎలా ఉంటుందో ప్రాక్టికల్‌గా చూపించాడు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గురించి ఏం చెబుతాం కానీ, చరణ్ విదేశీ ఖ్యాతి గురించి ఓ మారు ముచ్చటించాల్న!
రామ్‌చరణ్ ఇప్పుడు అమెరికా బాక్సాఫీస్ వద్ద 15కోట్ల (2.5 మిలియన్ డాలర్లు) వసూళ్లతో నంబర్ -2 హీరో స్థానానికి ఎదిగేశాడు. బాహుబలి సిరీస్ తరవాతి స్థానం రంగస్థలం లాక్కోవడంతో అతడు ఓవర్సీస్ బాక్సాఫీస్‌లో టాప్ -2ని అందుకున్నాడు. అంతేకాదు.. అతడికి వేరొక చోట అంతే గొప్ప గుర్తింపు దక్కింది. మన తెలుగు వాళ్లు ఉండే ఆస్ట్రేలియా దీవిలోనూ రంగస్థలం వసూళ్ల హవా సాగుతోంది. అక్కడ మనోళ్లు ఉండేది తక్కువే అయినా, ఏకంగా కోటిన్నర వసూళ్లు తెచ్చేశాడు నాలుగు రోజులకే. `రంగస్థలం` ఆసీస్ బాక్సాఫీస్ నుంచి 289కె ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. 2018లో ఆస్ట్రేలియాలో టాప్-5 వసూళ్ల లిస్ట్‌లో పద్మావత్ 1728కె ఆస్ట్రేలియన్ డాలర్ల తో నంబర్ -1 స్థానంలో నిలవగా, ఆ తరవాత రంగస్థలం 289కె డాలర్లతో రెండో స్థానం లో నిలిచింది. టైగర్ ష్రాఫ్ భాఘి 2- 290కె ఆ.డాలర్లు, సంజన్సింగ్ రంగ్రూట్ (పంజాబీ)- 237కె ఆ.డాలర్లు, లాంగ్ లుచ్చా- 250కె ఆ.డాలర్లు వసూలు చేసి టాప్-5లో నిలిచాయి. ఓ రకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాని మినహాయిస్తే, మన రామ్‌చరణ్ ఆస్ట్రేలియాలో నంబర్ -1 హీరో కిందే లెక్క.