రెండో షెడ్యూల్ కి రెడీ అవుతున్న చరణ్ ?

Friday, March 30th, 2018, 09:58:03 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోనా నటించిన రంగస్థలం యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనతో అదరగొట్టాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక మెగా అభిమానులకైతే ఆనందానికి హద్దులే లేవు. తమ హీరో వెండితెరపై ఓ రేంజ్ లో అదరగొట్టాడని పండగ చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో కూడా భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ఏప్రిల్ 10 నుండి మొదలు కానుందట. ఖైదా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.