చరణ్ జగదేకవీరుడు టైటిల్ కన్ఫర్మా ?

Saturday, June 2nd, 2018, 01:10:07 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. మూడో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇదివరకే ఈ సినిమాకు రాజా వంశస్తుడు అనే టైటిల్ పెడతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ పెట్టడం లేదని చిత్ర యూనిట్ ఖరారు చేయడంతో మరి ఏ టైటిల్ పెడతారా ? అన్న ఆసక్తి ఎక్కువైంది. తాజాగా .. ఈ సినిమాకు జగదేకవీరుడు అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఓకే చేసేలా ఉన్నారట. అయితే ఈ టైటిల్ పై అటు మెగాస్టార్ కూడా పాజిటివ్ గా ఉన్నాడని తెలిసింది. ఈ టైటిల్ పెడితే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నారట. సో త్వరలోనే ఈ టైటిల్ పై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.