చేప‌లు ప‌డుతున్న స్టార్‌హీరో

Monday, May 21st, 2018, 11:21:44 PM IST

మ‌నిషి ప్ర‌కృతితో మమైకం కావ‌డం చాలా ఇంపార్టెంట్. ఆధునిక ప్ర‌పంచంలో మ‌నిషి డ‌బ్బు కోసం ప‌రుగులు పెడుతూ ప్ర‌కృతి జీవ‌నం మ‌ర్చిపోతున్నాడు. ఇక సినిమా స్టార్లు అయితే కోట్ల‌కు కోట్లు సంపాద‌న రుచిమ‌రిగి సాధార‌ణ జీవ‌నానికి దూర‌మైపోతున్నారు. ఒక సామాన్యుడి జీవితానికి.. ప్ర‌కృతితో మమేక‌మై జీవించే జీవ‌నానికి, అలానే ఖ‌రీదైన ల‌గ్జ‌రీకార్ల‌లో తిరిగే జీవ‌నానికి ఉన్న తేడా ఏంటో తెలిసిపోతోంది. అందుకే చాలా మంది క‌నీసం 50ప‌ర్సంట్ లైఫ్ త‌ర‌వాత అయినా ఓ కొత్త జీవితం కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

అదంతా స‌రే.. ఇక్క‌డ రామ్‌చ‌ర‌ణ్ ఏం చేస్తున్నాడో చూస్తే ఎవ‌రికైనా షాక్ క‌ల‌గ‌క మాన‌దు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తాను స్టార్‌ని అన్న సంగ‌తే మ‌ర్చిపోయాడు. గ‌త రెండురోజులుగా షాట్ గ్యాప్‌లో .. షూట్ గ్యాప్‌లో చ‌రణ్ ప్ర‌కృతి జీవ‌నంలో మ‌మేక‌మ‌య్యాడు. రిలాక్స్‌డ్‌గా ఫామ్ హౌస్ ఏరియాలో, తోట‌లో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే అత‌డు చెరువుగ‌ట్టున కూచుని చేప‌ల‌కు ఆహారం పంచాడు. మ‌రోచోట ఫామ్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద సేద‌దీరుతూ ప్ర‌కృతి అందాల్ని ఆస్వాధిస్తూ క‌నిపించాడు. ఎంత సంపాదించినా జానెడు పొట్ట‌కోసం.. కూసింత ప్ర‌శాంత‌త కోసం.. ఆ సంగ‌తిని చెర్రీ గుర్తెరిగిన‌ట్టే కనిపిస్తోంది. హ‌బ్బీ చ‌ర‌ణ్ ఫోటోల్ని, వీడియోల్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తూ అత‌డినే త‌లచుకుంటున్నారు ఉపాస‌న కామినేని.

  •  
  •  
  •  
  •  

Comments