భ‌ర‌త్ పార్టీలో చెర్రీ సీక్రెట్ గేమ్‌?

Sunday, April 8th, 2018, 04:34:34 PM IST

“మేమంతా ఒక‌టే .. మీరు జాగ్ర‌త్త‌!“ అని ఫ్యాన్స్‌ను ఉద్ధేశించి మ‌హేష్ చేసిన సూచ‌న గుర్తుకొచ్చిందా? ఇది ప‌క్కా నిజం. నిన్న‌టి రేయి `భ‌ర‌త్ అనే నేను` ప్రీరిలీజ్ వేదిక‌పై అభిమానుల‌కు మ‌హేష్ పైవిధంగా సూచించారు. నిజ‌మే అది… మేమంతా ఒక‌టే అన్న మాట‌కు క‌ట్టుబ‌డి ఈవెంట్ త‌ర‌వాత జ‌రిగిన పార్టీలో స్టార్లంతా క‌లిసి ఫుల్లుగా చిలౌట్ చేశారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో పాటు తార‌క్ వేదిక‌పై క‌నిపించినా, రామ్‌చ‌ర‌ణ్ మాత్రం అక్క‌డ‌ క‌నిపించ‌లేదు. కట్ చేస్తే, ఆఫ‌ర్ట్ పార్టీలో చెర్రీ త‌ళుక్కుమ‌న్నాడు. మేమంతా ఒక‌టే అని నిరూపించాడు.

టాలీవుడ్‌లో ఉన్న‌ది అర‌డ‌జను స్టార్ హీరోలే.. తిప్పి తిప్పి కొడితే.. అంద‌రి సినిమాలు ఆడాల‌ని ఆకాంక్షించాడు అదే వేదిక‌పై మ‌హేష్‌. నిజ‌మే .. త‌న‌తో పాటు ఇత‌ర హీరోల సినిమాలు ఆడాల‌న్న మంచి మాట చెప్పాడు. ఒక‌రి సినిమా ప్ర‌మోష‌న్స్‌కి ఇంకొక‌రు రావ‌డం అన్న ట్రెండ్ ఇక‌ముందూ ఇలానే సాగాల‌ని ఆకాంక్షించాడు. పార్టీలో మ‌హేష్‌తో క‌లిసి చ‌ర‌ణ్‌, తార‌క్ చిలౌట్ చేసిన విధానం ఫోటోల రూపంలో సామాజిక మాధ్య‌మాల్లోకి లీక‌య్యాయి. ఆ ముగ్గురితో పాటు, భ‌ర‌త్ అనే నేను నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, ఛాయాగ్రాహ‌కుడు తిర్రు, మైత్రి మూవీస్ అధినేత‌లు న‌వీన్ ఎర్నేని, ర‌వి, సి.వి.మోహ‌న్‌, కైరా అద్వాణీ ఈ పార్టీలో క‌లిసి ఛీర్ చేసుకున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇండ‌స్ట్రీలో హై ప్రొఫైల్ పార్టీ ఇదే.