బోయపాటి సినిమా షూటింగ్ మొదలు పెట్టిన చరణ్ ?

Monday, April 23rd, 2018, 11:49:25 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ఈ నెల 21 న మొదలైంది. రంగస్థలం విజయంతో జోరుమీదున్న చరణ్ నటిస్తున్న 12వ సినిమా ఇది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఇంట్లో పూజ చేసి వెళ్ళాడు చరణ్. తాజగా ఈ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ చరణ్, బోయపాటి శ్రీను షూటింగ్ లో పాల్గొంటున్నాడు అంటూ గుడ్ లక్ చరణ్ అంటూ కామెంట్ పెట్టింది. రామ్ చరణ్ సరసన ఖైరా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments