ఆ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చిన చరణ్ ?

Wednesday, March 14th, 2018, 10:37:43 AM IST

తన మనసుకు నచ్చిన కథలతో సినిమాలు తీసే దర్శకులతో మరోసారి పనిచేసేందుకు పలువురు హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అలాంటి క్రేజీ కాంబినేషన్లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా రామ్ చరణ్ కూడా అలాంటి అవకాశమే ఇచ్చాడట దర్శకుడు సుకుమార్ కు ? ప్రస్తుతం రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా తీస్తున్న సుకుమార్, ఈ సినిమాలో చరణ్ ను కొత్త లుక్ లో చూపిస్తున్నాడు. ఇప్పటికే రంగస్థలం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1985 నేపథ్యంలో కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 30 న విడుదల కానుంది. అయితే రంగస్థలం సినిమా సమయంలో సుకుమార్ తో ఏర్పడిన ఫ్రెండ్షిపి .. అయన టాలెంట్ కు నచ్చిన చరణ్ వెంటనే మరో సినిమా కలిసి చేద్దామని చెప్పాడట ? చెప్పడమే కాదు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని టాక్. రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ తో సైరా చేస్తున్న చరణ్ ఈ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా సుకుమార్ తోనే ఉంటుందని చెప్పాడట. అయితే సుకుమార్ మాత్రం సినిమా చేయడానికి ఇంకా కాస్త టైం పడుతుందని చెప్పినట్టు టాక్. అయితే సుకుమార్ తో చిరంజీవి తో ఓ సినిమా తీయించే ఆలోచనలో కూడా ఉన్నాడట చరణ్.