24,60,000 US Dollar equals
15,99,50,430.00 Indian Rupee
`రంగస్థలం` 100 కోట్ల క్లబ్లో చేరిందని అధికారికంగా పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఇంటా బయటా చరణ్ హవా నడుస్తోందనడానికి ఇదే సింబాలిక్. గోదారి నేటివిటీ.. తెలుగోడి కల్చర్ వరల్డ్ బాక్సాఫీస్‌ని అలా షేకాడించిందని వేరొక కోణంలో విశ్లేషించవచ్చు. ఇకపోతే రామ్‌చరణ్ హవా ఓవర్సీస్లోనూ ఓ రేంజులో ఉంది.
ఈ సినిమా ఇప్పటికే కీలకమైన అమెరికా బాక్సాఫీస్ వద్ద 13 కోట్లు పైగా వసూలు చేసిందని నిన్నటిరోజున రిపోర్ట్ అందింది. నేడు మరో తాజా అప్డేట్. ఈ సినిమా కేవలం ఓవర్సీస్లో 16 కోట్లు (2.46 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. అంటే ఇంకో నాలుగు కోట్లు కేవలం తొలివారంలోపే వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వసూళ్లతో ఓవర్సీస్లో చరణ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఫుల్ రన్లో ఆ స్థానం మరింత మెరుగవ్వనుంది. రంగస్థలం కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసిన సంగతి విదితమే.