ఎన్టీఆర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చరణ్ ?

Monday, May 21st, 2018, 11:49:52 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అయన అభిమానులు జోరుగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అయన ఫాన్స్ సోషల్ మీడియాను బర్త్ డే గ్రీటింగ్స్ తో దుమ్ము రేపారు. అయితే ఎన్టీఆర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య మంచి స్నేహబంధం ఉన్న నేపథ్యంలో ఇద్దరు వీలైనప్పుడల్లా కలిస్తుండడం .. అటు ఫ్యామిలీ మధ్య కూడా మంచి రిలేషన్ ఉండడంతో చరణ్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా .. ఈ ఏడాది నేను అద్భుతంగా ఉండాలి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చరణ్ ఎన్టీఆర్ కోసం ఓ ఖరీదైన జిమ్ గిఫ్ట్ ఇచ్చాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకోసం సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు. అందుకే అయన జిమ్ లో ఇంకా ఫిట్ గా కావాలని కోరుకుంటూ చరణ్ ఈ గిఫ్ట్ అందించాడు. ఇక చరణ్ తో కలిసి ఎన్టీఆర్ హీరోగా కలిసి నటించే మల్టీస్టారర్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments