మహేష్ కష్టాల్లో పాలుపంచుకోనున్న చరణ్..?

Thursday, November 2nd, 2017, 07:04:43 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం ఇటువంటి ఫలితాన్ని ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రం వలన నిర్మాతకు, బయ్యర్లకు గట్టి దెబ్బ తగిలింది. స్పైడర్ భారీ నష్టాలని మిగల్చడంతో ఈ చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ రికవరీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారీగా ఏర్పడిన నష్టాలని పూడ్చుకోవాలంటే నిర్మాతకు మరో భారీ హిట్ అవసరం. దీనితో ఎన్వీ ప్రసాద్ వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. ఎన్వీ ప్రసాద్ కు మెగా ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో ఆయన చరణ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

తనకు ఓ సినిమా చేసిపెడితే సేవ్ అవుతానని రిక్వస్ట్ చేయడంతో చరణ్ ఆయనకు హామీ ఇచ్చారట. కానీ ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది..దర్శకుడు ఎవరు అనే విషయాలపై ఇంకా చర్చ జరగలేదు. రామ్ చరణ్ కు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తరువాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments