వైరల్ వీడియో : ఛార్మి లిప్ కిస్..ఎవరికో తెలుసా..!!

Tuesday, January 16th, 2018, 10:10:22 PM IST

ఛార్మి చాలా కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. సినిమాల్లో ఛార్మి జోరు తగ్గింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఛార్మి బాగా యాక్టివ్. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే ఛార్మికి పెంపుడు జంతువులంటే బాగా ఇష్టం. తన పెంపుడు చిలుక తో కలసి లంచ్ చేస్తున్న వీడియోని ఛార్మి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అభిమానులని ఈ వీడియో తెగ ఆకట్టుకోవడమే కాదు వైరల్ గా మారిపోయింది కూడా.

ఈ అందాల బ్యూటీకి ఆ చిలుక ఏకంగా లిప్ కిస్ ఇచ్చేసింది. ఛార్మితోకలసి ఒకేకంచం లో అన్నం తినడం, ఛార్మి పెదాలని ముద్దాడుతున్న చిలుక చేష్టలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఛార్మి పెంచుకుంటున్న ఆ చీలిక పేరు ‘మిట్టూ’. అప్పుడప్పుడూ తన పెంపుడు కుక్కలతో దిగిన ఫోటోలని కూడా ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. మిట్టూ, ఛార్మీల లిప్ కిస్ ని ఈ వీడియోలో మీరుకూడా చూసేయండి.