పూరితో కనెక్షన్ గురించి ఛార్మి ఏమందో తెలుసా ?

Monday, April 30th, 2018, 10:35:27 AM IST

క్రేజీ దర్శకుడు పూరి జగన్నాద్ తెరకెక్కించిన జ్యోతి లక్ష్మి సినిమాతో హీరోయిన్ ఛార్మి – పూరి ల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఆ సినిమాలో ఆమెను సహా నిర్మాతగా మార్చేశాడు పూరి. ఇక అక్కడినుండి పూరితో ఛార్మి కలిసి ప్రతి సినిమాకు పనిచేస్తుంది. పైగా ఇద్దరు కలిసి పూరి కనెక్ట్ అంటూ ఓ ఈవెంట్ కంపెనీని ఏర్పాటు చేసారు. పూరితోనే ఛార్మి ఉంటుందని కాబట్టి వీరిద్దరి గురించి పలుమార్లు రూమర్స్ తెగ పుట్టుకొచ్చాయి. ఇద్దరి మధ్య ఎదో వ్యవహారం నడుస్తుందని, చారితో పూరి డేటింగ్ చేస్తున్నాడని చాలా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పూరి బ్యానర్ లో నిర్మాతగా వ్యవహారాలు చూసుకుంటున్న ఛార్మి ఈ విషయం పై తాజాగా స్పందించింది. జనాలు ఎవరేమనుకున్నా తాను పూరి మంచి స్నేహితులమని చెప్పింది. తాను , పూరి కూడా ఫేమస్ కాబట్టి జనాలు మా గురించి ఏవేవో మాట్లాడుకుంటారు. అదే నేను అబ్బాయిగా ఉంది ఇదే వ్యవహారాలు చూసుకుంటే అలా అనుకోరు కదా !! నేను ఒక హీరోయిన్ కాకపోయినా ఇలాంటి వార్తలు రావు. ఇప్పుడు నేనేం చెప్పిన ఎవరు పట్టించుకోరు. అందుకే వివరణ ఇవ్వడం మానేసాను. ఎవరేమి అనుకున్నా సరే .. !! నా జీవితం నేనే బతకాలి, వాళ్ళు అలా అంటున్నారు .. వీళ్ళు ఇలా అనుకుంటుంన్నారని అన్ని పనులు ఆపేసి కూర్చోలేము కదా !! ఇతరుల జీవితాల గురించి ఆరాలు తీయడం ఆపేసి మీ జీవితాన్ని బాగుచేసుకునే పనిలో పడండి. నా లైఫ్ గురించి నాకు నచ్చిందే చేస్తానంటూ కాస్త గట్టిగానే చెప్పేసింది అందాల ఛార్మి.

  •  
  •  
  •  
  •  

Comments