టీడీపీ నేతపై చీటింగ్ కేసు.. షాక్‌లో చంద్రబాబు..!

Saturday, December 14th, 2019, 11:30:29 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు చేసిన అక్రమాలను, దోపీడీలను ఆధారాలతో సహా వెలికితీస్తూ వైసీపీ ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేయిస్తుంది. అయితే ఇప్పటికే చింతమనేని, యరపతినేని, కూన రవికుమార్, హర్ష కుమార్ వంటి పలువురు నేతలపై కేసులు పెట్టి జైళ్ళకు పంపిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కర్నూల్ జిల్లా ఆలూరులో టీడీపీ నాయకుడు నారాయణ చౌదరిపై చీటింగ్ కేసు నమోదైంది. 2018లో హత్తిబెళగల్ క్వారీ పేలుళ్లలో పోలీసులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి రూ.35 లక్షల వసూళ్లకు పాల్పడినట్లు క్వారీ యజమాని శ్రీనివాస చౌదరి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ క్వారీ పేలుళ్లలో 12 మంది మృతి చెందగా కేసు తీవ్రతను తగ్గిస్తామని నారాయణ చౌదరి అబద్ధపు మాటలు చెప్పి తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు నారాయణ చౌదరిని అరెస్ట్ చేసి 35 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.