రెండే రెండు నిమిషాల్లో కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది..!

Friday, April 23rd, 2021, 01:06:32 AM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్ర రూపం దాల్చుతుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇదిలా ఉంటే ఆపత్రుల్లో బెడ్లు ఖాళీ లేక, ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపధ్యంలో కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కనీసం టెస్ట్ చేయాలన్న కిట్లు దొరకని పరిస్థితి దేశంలో దాపురించింది. ఈ సమయంలో చెన్నైలోని ఓ ఆసుపత్రి పరిశోధకులు అద్భుత ఆవిష్కరణను రూపొందించి అందరి చేత శభాష్ అనిపించారు.

అయితే కరోనా టెస్ట్ చేయించుకుని ఇకపై రిజల్ట్ కోసం రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సిన పనిలేదు. కేవలం రెండంటే రెండు నిమిషాల్లో మనకు కరోనా ఉందో లేదో ఇట్టే తెలిసిపోతుంది. ఎలాంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా కేవలం 2 నిమిషాల్లో కరోనాను గుర్తించే పరికరాన్ని చెన్నై కీజపక్కంలోని కేజే ఆసుపత్రి పరిశోధకులు తయారు చేశారు. KJ కోవిడ్ ట్రాకర్ పేరుతో పిలిచే ఈ డివైజ్ చూడ్డానికి చేతి ఆకారంలో ఉంటుంది. ఈ డివైజ్ సాయంతో బీపీ, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్, రక్తకణాల సంఖ్యతో పాటు ఆక్సిజన్, బీటా పొటెన్షియల్ స్థాయిలను కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇది RT-PCR కంటే మరింత పక్కాగా రిజల్ట్ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు.