విక్రమ్ జాడని కనిపెట్టింది చెన్నై ఇంజనీర్…ఇదిగో సాక్ష్యం

Tuesday, December 3rd, 2019, 01:00:49 PM IST

భారతీయ శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి నింగిలోకి పంపిన చంద్రయాన్-2 చివరి దశలో తడబడింది, విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీదకి పంపిన విక్రమ్ ల్యాండర్ ఆఖరి నిమిషాల్లో సాంకేతిక లోపల కారణంగా కమ్యూనికేషన్ నిలిచిపోయింది. అయితే విక్రమ్ జాడని నాసా కనిపెట్టినట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే దానికి కారకుడైన చెన్నై ఇంజనీర్ షణ్ముగ సుబ్రహ్మణియన్ ప్రతిభని గుర్తిస్తూ అతనికి మెయిల్ ద్వారా సందేశం పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చెన్నై ఇంజనీర్ పలు విషయాలు వెల్లడించారు.

నాసా కూడా విక్రమ్ జాడని కనుక్కోలేకపోవడాన్ని సవాలుగా స్వీకరించిన ఆ యువకుడు, దాని కోసం చాల రకాలుగా ప్రయత్నించారు. విక్రమ్ జాడని కనిపెట్టేందుకు రోజుకి దాదాపు 7 నుండి 8 గంటలు శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. అలా ఒక అయిదు రోజులు శ్రమించాక దాని జాడని గుర్తించడం జరిగిందని తెలిపారు. అవగాహన ఉంటే ఇది ఎవరైనా చేయొచ్చని, ఈ నా ప్రయోగం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని భావిస్తున్నాను అని అన్నారు. అయితే ఈ చెన్నై యువకుడు సాధించిన ఘనత కి భారతీయులు భారీ ఎత్తున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నారు.