చిదంబరం, అమిత్ షాల అరెస్ట్ టైమింగ్ కాస్త మిస్సయింది..!

Wednesday, August 21st, 2019, 10:26:19 PM IST

కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కొద్ది సేపటి క్రితం సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నింధితులుగా ఉన్న చిదంబరాన్ని అరెస్ట్ చేయాలని ఈడీ మరియు సీబీఐ అధికారులు నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నారు. అయితే చిదంబరం మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళి సీబీఐ అధికారులకు చిక్కలేదు. అయితే తాజాగా 24 గంటల అజ్ఞాతం వీడి చిదంబరం మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న అధికారులు వెంటనే పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్న కార్యకర్తలు వారిని లోపలికి అనుమతించకపోవడంతో చిదంబరం వేరే గేట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చిదంబరం ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ సెక్యూరిటీ ఇంట్లోకి అనుమతించకపోవడంతో అధికారులు గోడ దూకి మరీ ఇంట్లోకి వెళ్ళి చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో 201లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం హోం శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అప్పౌడు అమిత్‌షాను పార్టీ ఆఫీసుకు రాగానే సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక ఇప్పుడేమో అమిత్‌షా హోం మంత్రిగా ఉన్నారు చిదంబరాన్ని పార్టీ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేసి ఉంటే సేం సీన్ పునరావృత్తం అయ్యేది కానీ కాస్తలో ఆ సీన్ మిస్ అయ్యిందనే చెప్పాలి. పార్టీ ఆఫీస్ దగ్గర మిస్ అయిన చిదంబరాన్ని ఎట్టకేలకు ఇంటి దగ్గర అరెస్ట్ చేసారు.