జల్లికట్టు ఎఫెక్ట్..ముఖ్యమంత్రి పరుగో పరుగు..!!

Thursday, January 19th, 2017, 09:50:52 AM IST

jallikattu
జల్లుకట్టు కు మద్దతుగా తమిళనాడులో యువత చేపట్టిన ఆందోళనలకు అనూహ్య స్పందన వస్తోంది.ఈ విషయంలో సినీ రాజకీయ ప్రముఖులంతా ఏకమయ్యారు. పలువురు సెలెబ్రిటీలు యువత ఆందోళనలకు మద్దత్తు తెలుపుతున్నారు. ఆందోళనలతో పరిస్థితులుతీవ్రగా మారుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం అలెర్ట్ అయింది. జల్లికట్టు పై నిషేదంఎత్తివేయాలని ప్రధాని మోడీని కోరడానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీకి పరుగున వెళ్లారు. నేడు ఆయన మోడీ తో భేటీ కానున్నారు. జల్లికట్టు కు మద్దతుగా జరుగుతున్న నిరసనలకు ఏ నాయకుడూ నాయకత్వం వచించలేదు. దీనిపై ఉద్యమం చేయాలనీ ఎవరూ పిలుపునివ్వలేదు. కానీ యువత అంతా ఏమైంది. జల్లికట్టు పై నిషేధాన్ని ఎత్తివేసేంత వరకు మెరీనా బీచ్ ని వదిలేది లేదంటూ నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ ప్రధాని మోడీ ని కలసి జల్లికట్టు పై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఆర్డినెన్స్ ని తీసుకుని రావాలని కోరనున్నారు. విద్యార్థులంతా జల్లికట్టు నిరసనలతో పాల్గొంటుండగా పలు విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. చెన్నై లో చలన చిత్ర పరిశ్రమకుడా జల్లికట్టు కు మద్దత్తు తెలిపింది.ఈ సందర్భంగా నేడు సినిమా, బుల్లితెర లకు సంభందించిన షూటింగ్ లు, ఇతర కార్యక్రమాలు జరగవని ప్రకటించింది. జల్లికట్టు పై నిషేధం ఎత్తివేయాలని హై కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది.ఈ వ్యవహారం సుప్రీం లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని హై కోర్ట్ ప్రకటించింది.ఓ వైపు ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ కానుండగా, అన్నా డీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ని కలసి జల్లికట్టు పై నిషేధం ఎత్తివేసేలా ఆర్డినెన్స్ తీసుకుని రావాలని కోరన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.