అప్పటి బాల నటుడు ఇప్పుడు స్టైలిష్ హీరోగా వస్తున్నాడు!

Sunday, September 2nd, 2018, 11:42:24 PM IST

ఈ ఫొటోలో ఉన్న బాలుడిని ఎక్కడో చూసినట్టు ఉందని అనిపిస్తోంది కదా.. అప్పట్లో బాలనటుడిగా సినిమాల్లో ఎమోషన్ ని పండించిన ఈ బాలుడిని ఎలా మర్చిపోతాం. ముఖ్యంగా దేవీ, ఆహా, పెదరాయుడు.. వంటి చిత్రాల్లో ఇతను చేసిన పాత్రలు మంచి గుర్తింపును అందించాయి. ఈ బాలుడి పేరు మహేంద్రన్. ఇప్పుడు బాలుడు కాదు లెండి. మాంచి కండలు తిరిగిన హీరోలా మారాడు. కింద ఇచ్చిన ఫొటోపై ఓ లుక్కిస్తే మీకే అర్ధమవుతుంది.

ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మహేంద్రన్ సిద్ధంగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా డ్యాన్స్ లలో అలాగే యాక్షన్ వంటి సన్నివేశాల కోసం శిక్షణ తీసుకున్న మహేంద్రన్ సైలెంట్ గా ఒక సినిమాను కూడా స్టార్ట్ చేశాడట. ఆ సినిమా దాదాపు పూర్తికావచ్చిందట. త్వరలోనే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్ తో హంగామా చేయడానికి సిద్దమవుతున్నట్లు టాక్. మహేంద్రన్ బాలనటుడిగా 50కి పైగా సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అక్కడ అవార్డు అందుకున్నాడు. మరి ఇప్పుడు యువ హీరోగా మహేంద్రన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments