పది నెలల పసికందు పట్ల దారుణంగా..!

Friday, November 25th, 2016, 05:14:17 PM IST

baby
ముంబై లోని ఓ బాలల సంరక్షణ కేంద్రంలో పిల్లలను కంటికి రెప్పలా చూడాల్సిన సంరక్షకురాలు పది నెలల పసికందు పట్ల అమానుషంగా ప్రవర్తించింది.తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడతారన్న నమ్మకంతోనే తల్లిదండ్రులు అక్కడ వాడాలి వెళ్తారు.కానీ ఆమె పసిబిడ్డ పట్ల ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నేవి ముంబై కి చెందిన ఓ జంట తమ పాపని బలాలు సంరక్షణ కేంద్రం లో వాడాలి వెళ్లారు.

అయితే సాయంత్రం తిరిగి చిన్నారిని ఇంటికి తీసుకుని వచ్చి చూసే సరికి కంటి భాగం లో తీవ్రంగా గాయమై ఉంది.అనుమానం వచ్చిన తల్లి దండ్రులు సంరక్షన కేంద్రం వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలను చెప్పారు. దీనితో వారు పోలీస్ లకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపినవారు సంరక్షణ కేంద్రం సిసి టివి ఫుటేజ్ ని పరిశీలించగా ఇది అక్కడ సంరక్షకురాలిగా పని చేస్తున్న మహిళా అఘాయిత్యమని తేలింది. చిన్నారి నిద్రపోవడం లేదని ఇష్టం వచ్చినట్లు కొడుతూ కాలితో తంతూ చిత్ర హింసలకు గురిచేసింది.దీనితో పోలీస్ లు నిర్వాహకులని ఆ మహిళని అరెస్టు చేశారు