ఇకపై ముగ్గురిని కనొచ్చు.. చైనా మరో కీలక నిర్ణయం..!

Monday, May 31st, 2021, 08:32:24 PM IST

జనభాలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్న చైనా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఒక‌ప్పుడు ఒక్క‌రిని మాత్ర‌మే క‌నాల‌ని క‌ఠిన నిబంధ‌న‌లు పెట్టింది. 1970 నుంచి 2016 వ‌ర‌కు ఒకే సంతానం అనే నినాదాన్ని అమ‌లు చేయగా, ఆ తర్వాత 2016 నుంచి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో గత విధాన పరమైన నిర్ణయాన్ని సడలించింది. ప్రపంచంలో నెంబర్ స్థానంగా ఎదగాలంటే వృద్ధుల సంఖ్య పెరిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరలేమని అందుకే ముగ్గుర్ని కనొచ్చని జిన్‌పింగ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా చైనా జ‌నాభా నిర్మాణ ప‌ద్ధ‌తిని వృద్ధి చేయ‌డానికి ఈ నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అక్క‌డి విశ్లేష‌కులు చెబుతున్నారు.