ట్రంప్ వ‌ల్ల మ‌న‌కంటే పాక్‌, చైనాల‌కే న‌ష్టం!

Sunday, January 22nd, 2017, 07:03:22 PM IST

trump-speach
డొనాల్డ్ ట్రంప్ అమెరికా గ‌ద్దెనెక్క‌డం వ‌ల్ల ఏ దేశానికి ఎంత న‌ష్టం? అన్న లెక్క‌లు తీస్తున్నారు. పాకిస్తాన్‌కి లాభం, చైనాకి న‌ష్టం, భార‌త్‌కి ఉద్యోగాలు పోతాయ్‌! అంటూ ప్ర‌చారం సాగిస్తున్నారు. అయితే ఇందులో వాస్త‌వం ఏమిటి? అని విశ్లేషిస్తే డొనాల్డ్ ట్రంప్ భావ‌జాలం వ‌ల్ల‌, అత‌డి యుద్ధోన్మాదం వ‌ల్ల‌, అతి వ‌ల్ల మ‌న‌కంటే చైనా, పాకిస్తాన్ ఎక్కువ న‌ష్ట‌పోయే ఛాన్సుంద‌ని విశ్లేషిస్తున్నారు.

అమెరికాలో అమెరిక‌న్ల ఉద్యోగాలు, ఉపాధికోసం కృషి చేయ‌డం వ‌ల్ల, హెచ్‌1 బి వీసాలపై ప‌ట్టు బిగించ‌డం వ‌ల్ల భార‌త్ కొన్ని ఉద్యోగాలు మాత్ర‌మే కోల్పోవ‌చ్చు. కానీ అగ్ర రాజ్య హోదాని కాపాడుకోవాలంటే చైనాతో ఢీ అంటే ఢీ అనాల్సిన స‌న్నివేశం ఉంది. అందుకే చైనాకి సంబంధించిన ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు అమెరికాలో నిషేధించ‌డ‌మో, లేదు వాటికి ప్ర‌త్యామ్నాయాల గురించి ఆలోచించ‌డ‌మో చేస్తే అమెరికాలో అతిపెద్ద మార్కెట్ ఉన్న చైనా వాణిజ్య ప‌రంగా తీవ్రంగా దెబ్బ తింటుంది. అదొక్క‌టే కాదు ఉగ్ర‌వాద వ్య‌తిరేకిగా ట్రంప్‌కి ఉన్న కార్డ్ దృష్ట్యా.. పాక్‌కి ట్రంప్ వ్య‌తిరేకం. ఆళ్ల‌కు పోయిన‌దాంతో పోలిస్తే మ‌న‌కు పోయిందేం పెద్దంత కాద‌ని దీన్నిబ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.