ఇక పర్యాటక కేంద్రంగా రాష్ట్రం

Sunday, September 28th, 2014, 04:34:09 PM IST


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆద్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలో 6.35 లక్షల కోట్లతో నిర్మించిన కాటేజీలు, యాత్రికుల వసతీ గృహాలను ఆంధ్రప్రదేశ్ హొమ్ శాఖ మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యాటక రంగ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన తెలిపారు. పర్యాటక కేంద్రాలకు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు చినరాజప్ప తెలియజేశారు. రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని అన్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్నిరంగాలను సమానంగా అభివృద్ది చేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా.. అభివృద్దిలో అన్ని ప్రాంతాలు సమానంగా ఉంటాయని అన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపుతామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాలి కొండబాబు, వేగుళ్ళ జోగేశ్వరరావు మరియు కాకినాడ ఎంపి తోట సరసింహం తదితరులు పాల్గొన్నారు.