చింతమనేని మదం ఇంకా తగ్గలేదు..ఛీ కొడుతున్న నెటిజన్లు.!

Wednesday, September 11th, 2019, 04:15:43 PM IST

చింతమనేని ప్రభాకర్ ఇది ఏపీ రాజకీయ వర్గాలు సహా ఏపీ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.దానికి గల కారణం కూడా ఏమిటో అందరికి తెలుసు.ఈ కారణాలు చెప్పుకుంటూ పోతే ఒక్కటే కాదు అనేకం ఉన్నాయి.అలాంటి చెత్త ట్రాక్ రికార్డు ఉందని దెందులూరు నియోజకవర్గ ప్రజలు అంటారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు,కులాల పేర్లు పెట్టి సామాన్యులను దూషించడాలు అలాగే ఆఖరుకు జర్నలిస్టుల మీద కూడా ఈయన ప్రతాపం చూపించి సంచలనం రేపారు.

అయినా సరే చంద్రబాబు ఇతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చోద్యం చూసారు.అలా ఎన్నికలు వచ్చాయి ఏ అహంకారంతో అయితే ఎగసి పడ్డారో అందుకు తగ్గట్టుగా ఆయన పార్టీ సహా చింతమనేని కూడా బొక్క బోర్లా పడ్డారు.దీనితో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చెయ్యగా గత 14 రోజులు నుంచి మొత్తం 12 టీములు గాలిస్తుండగా తానే వస్తున్నా అని చెప్పి వచ్చారు.ఇక అతని ఓవరాక్షన్ చూడాలి.

తనని పోలీసులు పట్టుకోలేక ఇప్పుడు తన మీద ఓవరాక్షన్ చేస్తున్నారని,నేను రాను అంటూ కారులో కూర్చొని పోలీసులు కారు తలుపు లాగుతుండగా వెనక్కి లాగుతూ వారి మీద కూడా విరుచుకుపడుతున్నారు.దీనితో ఈ వ్యవహారం చూస్తున్న నెటిజన్లు మాత్రం చిత్రమనేనిపై మరోసారి ఛీ కొడుతున్నారు.అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ ఉద్యోగిని కొట్టినోడు ఇప్పుడు పోలీసు వ్యవస్థను చులకన చేసి మాట్లాడుతున్నాడు అంటూ మండి పడుతున్నారు.