ఆరు నెలల తర్వాత సీఎం జగన్ అధికారంలో ఉండరు – చింతా మోహన్

Sunday, April 4th, 2021, 03:04:46 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అధికార పార్టీ పై ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అటు ప్రతి పక్ష పార్టీ, ఇటు అధికార పార్టీ తీరు పట్ల ఒకరు పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన చింతా మోహన్ అధికార, ప్రతి పక్ష పార్టీ లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ధర్మ యుద్ధం లో సీఎం జగన్ గెలవలేరు అని చింతా మోహన్ అన్నారు. కాంగ్రెస్ కి పట్టిన గతే ఈ సారి బీజేపీ కి కూడా పడుతుంది అని అన్నారు. అయితే అధిక ధరలు బీజేపీ పతనానికి ప్రధాన హేతువు అని వ్యాఖ్యానించారు.

అయితే బీజేపీ అభ్యర్ధి కోసం జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ తరపున పవన్ చేస్తున్న ప్రచారం వలన ఉపయోగం ఏమీ లేదు అని వ్యాఖ్యానించారు. అదంతా కూడా వృథా ప్రయాస అని చెప్పుకొచ్చారు. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే జగన్ మీద కోపాన్ని ఆయన సోదరి షర్మిల తెలంగాణ లో చూపిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ ఆరు నెలల తర్వాత అధికారంలో ఉండరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ప్రలోభాలు లేకుంటే కాంగ్రెస్ కి మళ్ళీ ఆదరణ వస్తుంది అంటూ చింతా మోహన్ అన్నారు.