సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలి – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

Thursday, April 29th, 2021, 03:42:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ బెయిల్ శరతులను ఉల్లంఘించారు అని విమర్శించారు. అయితే సహా నిందితులు అయిన అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక సాక్షులను సీఎం జగన్ ప్రభావితం చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే లక్ష రూపాయల లంచం కేసులో బంగారు లక్ష్మణ్ ను జైలుకు పంపిన విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. అంతేకాక సీఎం జగన్ పై వందల కోట్ల ఆరోపణలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు బయట నుండి వచ్చారు అని వ్యాఖ్యానించారు. అయితే అలా వచ్చిన అనేకమందికి కరోనా వైరస్ సోకింది అని అన్నారు. అయితే పోలింగ్ కి, ఫలితానికి మధ్య ఇన్ని రోజుల వ్యత్యాసం ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే మాజీ మంత్రి చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.