చింతమనేని అక్రమాలపై అసెంబ్లీలో ధ్వజం.!

Friday, July 19th, 2019, 01:24:05 PM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో కొంతమందికి వారు చేసే మంచి పనుల వల్ల పేరు వస్తే మరికొంత మందికి వారు ప్రదర్శించే దురుసు ప్రవర్తన వల్ల మరో రకంగా పేరు వస్తుంది.ఇలాంటి ప్రవర్తనను చూపించే ఇప్పుడు గాఢాంధకారంలోకి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ కోసం ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చింది.

వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారి ఇసుక మాఫియా ఏ స్థాయిలో చేసారో మనమంతా చూసామని వారు ఆ అక్రమాలకు మాత్రమే పాల్పడడం మాత్రమే కాకుండా వీటిపై ప్రశ్నించిన కింద స్థాయి మహిళా అధికారులను అత్యంత దారుణంగా జుట్టు పట్టుకొని కొట్టినా సరే చంద్రబాబు అపుడు ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని మందలించాల్సింది పోయి ఆ కింద స్థాయి అధికారిణిని పిలిపించి మా ఎమ్మెల్యేకు సహకరించాలని అడగడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు.