చిరు 151 వ సినిమా కన్ఫర్మ్ అయిందా ?

Tuesday, February 28th, 2017, 02:40:37 AM IST


అంటే అవుననే సమాధానం వస్తుంది !! రీ ఎంట్రీ ఇస్తూ 150 వ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నంబర్ 150 వ సినిమాతో బాక్సాఫీసు వందకోట్ల మార్క్ కొల్లగొట్టిన చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏమిటనే విషయం పై మెగా ఫాన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై పలు వార్తలు వచ్చినప్పటికీ 151 వ సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఎలాగంటారా .. ఈ సినిమా గురించి హీరో శ్రీకాంత్ చెప్పేసాడు. లేటెస్ట్ గా ఓ ఫంక్షన్ లో అయన మాట్లాడుతూ అన్నయ చిరంజీవి 151 వ సినిమాగా మొదటి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో సినిమా చేస్తున్నాడు అని చెప్పాడు ? దాంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏమిటంటే విషయం కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు జరిగాయని, ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నట్టు తెలిసింది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.