ఖైదీ గురించి .. కామెంట్స్ చేసిన చిరంజీవి?

Monday, November 7th, 2016, 06:04:15 PM IST

kaidhi-number-150
తొమ్మిదేళ్ల రాజకీయాల తరువాత తన 150 వ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఈ సినిమా పై గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఇప్పటికే టాకీ పూర్తీ కావొచ్చింది. తమిళ ”కత్తి” చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా బాగా క్రేజీ గా జరిగింది. ఈ సినిమా విషయంలో చిరంజీవి కామెంట్స్ చేసాడట? సినిమా బాగా వస్తుంది .. ఖచ్చితంగా ఈ సినిమాతో మళ్ళీ క్రేజ్ రావడం ఖాయం అని చెబుతూనే .. ”బాహుబలి” తరువాత ఆ రేంజ్ క్రేజ్ ఈ సినిమాకు వస్తుందని వినాయక్ తో చెప్పాడట? ఒకవేళ అలా కాకున్నా కనీసం హిట్ తో అయిన గట్టెక్కుతాను అని అంటున్నాడు చిరు