గంటా రాజకీయం వెనుక చిరు పాత్ర ఎంత..?

Wednesday, October 9th, 2019, 09:00:56 PM IST

2019 లో టీడీపీ ఓడిపోవటం, వైసీపీ గెలిచి జగన్ సీఎం అవ్వటమనే విషయం కాసేపు పక్కన పెడితే, అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు ఐదు నెలల కాలంలో ఆంధ్ర రాజకీయాల్లో మార్మోగుతున్న టాపిక్ ఏమిటయ్యా అంటే గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీ వీడి, వైసీపీ కండువా కప్పుకోబోతున్నాడు అంటూ అనేక కధనాలు వచ్చాయి. నేడో రేపో చేరిపోతున్నాడంటూ బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది, కానీ గంటా పార్టీ మారే విషయంలో మాత్రం ఆచూతూచి అడుగులు వేస్తున్నాడు.

రీసెంట్ గా టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైసీపీ లో చేరి, మరోసారి ఎన్నికలు ఎదుర్కోవటానికి గంటా సిద్దమయ్యాడు అనే మాటలు వినవచ్చాయి. అయితే ఆ నిర్ణయాన్ని కూడా గంటా వెనక్కి తీసుకోని తాజాగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైయ్యాడు గంటా. దీనిని బట్టి చూస్తే ఇప్పటిలో గంటా పార్టీ మారే అవకాశం లేదని తెలిసిపోతుంది. అయితే గంటా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ కి ఎంతటి సన్నిహితుడో అందరికి తెలుసు. ఏమైనా కీలక నిర్ణయం తీసుకోవాలంటే గంటా ఖచ్చితంగా మెగాస్టార్ సలహాలను తీసుకుంటాడు. ఇదే క్రమంలో పార్టీ మారే విషయంలో చిరు సలహాని గంటా కోరటంతో ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి బాగాలేదనే మాట వాస్తవమే, అయితే ఇప్పటికిప్పుడు వైసీపీ లో చేరితే ఒరిగే లాభం కూడా ఏమి లేదు. అందులోను రాజీనామా చేసి మళ్ళీ పోటీచేస్తే గెలిచే అవకాశాలు తక్కువే, కాబట్టి కొంచం వేసిచూడమని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనితో గంటా తన వలస కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నాడు.