ఆ రెండు చిత్రాల నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చిన మెగాస్టార్?

Thursday, February 22nd, 2018, 10:08:08 AM IST

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య చిత్రాలు రిలీజ్ డేట్ ల విషయంలో కొంత సందిగ్థత నెలకొని వున్న విషయం తెలిసిందే. మొదట్లో బన్నీ చిత్ర నిర్మాతలు తమ చిత్రాన్ని ఏప్రిల్ 27 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత మహేష్ బాబు చిత్ర యూనిట్ తమ చిత్రాన్ని ఏప్రిల్ 26 న విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాగా భరత్ అనే నేను చిత్ర యూనిట్ కనీసం తమకు మాట అయినా చెప్పకుండా విడుదల తేదీని ప్రకటించడం పై నాపేరు సూర్య నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు కొంత ఆవేదన వ్యక్తం చేసారు.

ఇదివరకు జనవరి సమయంలో కూడా అలానే తమ చిత్రం విడుదల తేదీని ముందే ప్రకటించామని అయితే వెనువెంటనే భరత్ అనే నేను నిర్మాతలు కూడా అదే తేదీని ప్రకటించారని, అసలు కావాలనే వారు మా చిత్రానికి పోటీగా తమ చిత్రాన్ని నిలుపుతున్నారని అన్నారు. ప్రస్తుతాం తాము ఏ మాత్రం తగ్గేది లేదని, మా చిత్రాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 26 న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. వాస్తవానికి రజిని నటిస్తున్న 2.0 చిత్ర విడుదల తేదీ వచ్చాక ఈ రెందు చిత్రాల నిర్మాతలు తమ చిత్రాల విడుదలలు ప్రకటిద్దామనుకున్నప్పటికీ మధ్యలో సడెన్ గా రజిని నటిస్తున్న కాలా చిత్రాన్ని ఏప్రిల్ 27 న విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే .

కాగా ప్రస్తుతం బన్నీ, మహేష్ చిత్రాల విడుదల విషయమై జరుగుతున్న వివాదానికి ముగింపు పలకాలని చలన చిత్రరంగ పెద్దలు అందరు కలిసి ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకుకెళ్లారని సమాచారం. ఈ విషయమై చిరంజీవి నా పేరు సూర్య చిత్ర నిర్మాత బన్నీ వాసు ని పిలిపించి మాట్లాడినాట్లు, అలానే మహేష్ చిత్ర నిర్మాత దానయ్యతో కూడా ఫోన్లో సంప్రదింపులు జరిపిన పిదప, అలా ఒకేసారి రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదలవడంవల్ల ఇద్దరికీ నష్టమని సర్దిచెప్పి సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నా పేరు సూర్య మే మొదటి వారం లో విడుదలవుతుందని, భరత్ అనే నేను ఏప్రిల్ 21 న విడుదలవుతుందని వార్త అందుతోంది. డైరెక్ట్ గా మెగాస్టార్ రంగంలో కి దిగి సమస్యను పరిష్కరించినందుకు ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పినట్లు తెలుస్తోంది…..