అందుకు చిరంజీవి ఒప్పుకుంటాడా ?

Saturday, January 28th, 2017, 10:19:15 AM IST

CHIRU
”ఖైదీ నంబర్ 150” వ సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరంజీవి నెక్స్ట్ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే అయన నెక్స్ట్ సినిమా పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తాడని అంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో చాలా గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి. అయన కథతో సినిమా బాగానే ఉంటుంది కానీ .. ఈ సినిమా క్లైమాక్స్ లో అయన మరణించే సన్నివేశాలు ఉంటాయా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు సినిమాల్లో హీరోలు చనిపోతే అది జనాలు ఒప్పుకోరు. ప్రేక్షకుల మాట పక్కన పెడితే అసలు చిరంజీవే ఒప్పుకోరు .. ఎందుకంటే అయన నటించిన ”ఠాగూర్” సినిమాలో నిజానికి హీరో క్లైమాక్స్ లో చనిపోతాడు .. కానీ తెలుగులో దాన్ని మర్చి .. కోర్టు సీన్ తో కన్వేయ్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు. మరి ఈ సినిమా కథలో కూడా ఫైనల్ గా ఎలా మారుస్తారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.