షాకిస్తున్న మెగాస్టార్ రెమ్యూనరేష్ ?

Monday, February 13th, 2017, 11:07:06 AM IST


దాదాపు తొమ్మిదేళ్ల తరువాత మెగాస్టారా చిరంజీవి నటించిన 150 వ సినిమా ”ఖైది నంబర్ 150” సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని రాబట్టింది. ఈ సినిమాతో మెగాస్టార్ ఏకంగా వందకోట్ల హీరోగా మారిపోయాడు. ఇప్పటికి టాలీవుడ్ యంగ్ హీరోలు వందకోట్ల మార్కెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఒక్క మహేష్ బాబు తప్ప టాలీవుడ్ లో వందకోట్ల హీరో ఎవరు లేరు ? కానీ మెగాస్టార్ రీ ఎంట్రీ తోనే ఈ రికార్డ్ కొట్టడం అయనకున్న ఇమేజ్ ఏమిటో అర్థం అవుతుంది. ఇక స్పీడ్ గా వందకోట్ల మార్కెట్ ని సాధించిన చిత్రంగా రికార్డులు నెలకొల్పిన ఈ సినిమాకు చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా అక్షరాలా 32 కోట్లు ? అవును .. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా అనగానే బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే 90 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా విడుదలై సూపర్ హిట్ అవ్వడంతో బయ్యర్స్ కు కూడా మంచి లాభాలు వచ్చాయి .. ఈ సినిమాను కేవలం 35 కోట్లతో నిర్మించాడు చరణ్ .. లాభాలు మాత్రం అనుకున్న దానికంటే రెట్టింపు రావడంతో .. సినిమా ముందు చిరంజీవికి ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదట .. కానీ లాభాలు వచ్చాయి కాబట్టి ముందుగా చెప్పినట్టుగానే 60 % వాటా ఇచ్చాడట .. అంటే 32 కోట్లు అన్నమాట !! టాలీవుడ్ లో ఈ రేంజ్ రెమ్యూనరేష్ తీసుకున్న హీరోగా చిరంజీవి మరోసారి రికార్డ్ క్రియేట్ చేసాడు .. ? అప్పట్లో ఇండియాలోనే కోటి రూపాయలు తీసుకున్న తోలి హీరోగా రికార్డులకెక్కిన చరిత్ర చిరంజీవిది మరి !!