వాలంటైన్ డే హీరోయిన్స్ తో మెగా సెల్ఫీ.. అదిరిందబ్బా !!

Wednesday, February 15th, 2017, 10:43:10 AM IST


మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత మంచి జోరుమీదున్నాడు. ఖైదీ నంబర్ 150 తో వందకోట్ల మార్కెట్ ను కొల్లగొట్టి .. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నాడు. ఈ నెల 13 న ఈ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ షో లో అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీ లు కూడా పాల్గొంటారు. లేటెస్ట్ గా వాలంటైన్స్ డే సందర్బంగా సీనియర్ హీరోయిన్స్ రాధికా, సుహాసిని, సుమలతలు ఈ షో లో పాల్గొన్నారు. ఈ ముగ్గురితో మెగాస్టార్ చాలా సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా హీరోయిన్ రాధికతోనే చిరంజీవి నటించిన సినిమాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్బంగా అయన తన హీరోలతో వాలైంటైన్ డే సందర్బంగా ఓ మెగా సెల్ఫీకి పోజిచ్చాడు. నిజంగా ప్రేమికుల రోజున మెగాస్టార్ ఇచ్చిన సెల్ఫీ షాక్ ఇచ్చింది !!