ఆ రోజు చరణ్, చిరుల డబుల్ ధమాకా?

Tuesday, July 24th, 2018, 05:13:11 PM IST

మెగా ఫామిలీ లో ప్రస్తుతం తండ్రి తనయులైన మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇద్దరు ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్నారు. చిరు గత చిత్రం ఖైదీ నెంబర్ 150 అద్భుత విజయాన్ని అందుకోగా, చరణ్ నటించిన గత చిత్రం రంగస్థలం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ తదుపరి చిత్రాల షూటింగ్స్ లో బిజీగా వున్నారు. ఓవైవు చిరు సైరా నరసింహారెడ్డి చేస్తుంటే, మరోవైపు చరణ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటితో ఒక చిత్రం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరికి సంబందించిన ఒక వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

అదేంటంటే ఇప్పటికే చరణ్, బోయపాటిల ఫస్ట్ లుక్ మరియు టైటిల్ చిరంజీవి పుట్టిన రోజైన ఆగష్టు 22న రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే చిరంజీవి నటించిన సైరా చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఆ రోజు విడుదల చేసే అవకాశం ఉందట. ఈ మేరకు ఆ చిత్ర టీం కసరత్తులు మొదలెట్టిందని, టీజర్ ఎలాగైనా చిరంజీవి పుట్టినరోజుకి గిఫ్ట్ గా ఇవ్వాలని చూస్తున్నారట. మామూలుగానే ప్రతి సంవత్సరం చిరంజీవి బర్త్ డే ని ఎంతో ఘనంగా జరుపుకునే ఫాన్స్, ఇక ఈ సారి ఆయన చిత్రం మరియు చరణ్ చిత్రాల ఫస్ట్ లుక్, టీజర్ లు విడుదలవుతుంటే వారికి ఒకే సారి రెండుపండుగలు వచ్చినట్లేగా మరి. ఒకవేళ ప్రస్తుతం అందుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మెగా అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పుకోవాలి….

  •  
  •  
  •  
  •  

Comments