ద‌త్త‌న్న కుమార్తె పెళ్లి వేడుక‌లో రామోజీ, చిరు

Friday, November 25th, 2016, 05:31:24 PM IST

chiru-ramoji
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంట వివాహ మ‌హోత్స‌వం గురించి ఇటీవ‌ల రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగింది. ద‌త్త‌న్న (ద‌త్తాత్రేయ‌) కుమార్తె చి.ల‌.సౌ విజయలక్ష్మి, చి. జిగ్నేశ్‌ల వివాహం ఇటీవ‌ల‌ హైద‌రాబాద్‌లో ఘనంగా జరిగింది. గచ్చిబౌలిలోని మినీ స్టేడియంలో జరిగిన ఈ వివాహానికి రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజర‌య్యారు.

న‌వ వ‌ధూవరులు చి.ల‌.సౌ విజ‌య‌ల‌క్ష్మి- చి.జిగ్నేష్‌ల‌కు మెగాస్టార్ చిరంజీవి, ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు త‌మ ఆశీస్సులు అందించారు. ద‌త్తన్న తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి కేంద్ర మంత్రిగా ఖ్యాతి ఘ‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాహ మ‌హోత్స‌వానికి సీఎం కేసీఆర్ విచ్చేసి ఆశీస్సులు అందించిన సంగ‌తి విదిత‌మే.