ఖైదీ ఇంటికి వెళ్లిన గబ్బర్ సింగ్

Friday, January 20th, 2017, 09:56:47 AM IST

pawan_chiru
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలలోనూ, ఇటు రాజకీయాలలోనూ సమానంగా రాణిస్తున్నారు. ఒకవైపు సినిమాలలో స్టార్ హీరోగా రాణిస్తూనే, మరొకవైపు జనసేన పార్టీ పెట్టి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బీజేపీలకు మద్దతిచ్చి వారి విజయంలో కీలక పాత్రను పోషించారు. కానీ పవన్ జనసేన పార్టీ పెట్టిన తరువాత తన అన్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కూడా ఎవరు ఫంక్షన్స్ కు పిలిచినా హాజరయ్యేవారు కానీ, మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కు మాత్రం హాజరయ్యేవాడు కాదు. తాజాగా చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు స్వయంగా రాంచరణ్ వెళ్లి పిలిచినా పవన్ హాజరుకాలేదు.

ఈ నేపథ్యంలో చాలారోజుల తరువాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. చాలారోజుల తరువాత వీరిద్దరూ కలవడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడే చాల సమయం గడిపారు. వీరిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయో తెలియలేదు. వీరిద్దరూ కేవలం సినిమాలు, కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారా…? లేదంటే రాజకీయాలు గురించి మాట్లాడుకున్నారా…. అనేది తెలియాల్సి ఉంది.