బిగ్ న్యూస్ : చిరు పవన్ కు షాకివ్వబోతున్నారా..?

Wednesday, February 26th, 2020, 09:14:55 AM IST

కేంద్ర స్థాయి రాజకీయాల్లో రాజ్యసభ వార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.నిన్న మంగళవారం నాడు రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 55 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికలకు రంగం సిద్ధం కాబోతుంది అని వారు తెలుపుతూ సంబంధిత విషయాలను వెల్లడించారు.

వచ్చే మార్చ్ 6 వ తేదీన రాజ్య సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది అని అలాగే మార్చ్ 13 నామినేషన్ దాఖలుకు చివరి తేదీ కాగా 16న పరిశీలన 18న ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించి 26న ఎన్నికలు ఉండబోతున్నట్టు ఎన్నికల సంఘం వారు తెలుపగా తెలంగాణ నుంచి రెండు స్థానాలు అలాగే ఏపీ నుంచి నాలుగు స్థానాల్లో పోటీ ఉండబోతుంది అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

అయితే గత కొన్ని రోజులు నుంచీ జగన్ చిరుకు రాజ్య సభ స్థానం ఇవ్వబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తూ వస్తుంది.అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి ఈ సమాచారం బయటకు రావడంతో మరోసారి చిరు హాట్ టాపిక్ అయ్యారు.ఒకవేళ ఇదే వార్తలు కానీ నిజమయ్యి చిరు రాజ్య సభ సీటు తీసుకుంటే పవన్ కు అది దిమ్మ తిరిగే షాకే అని చెప్పాలి.అంతిమ నిర్ణయం చిరు చేతుల్లోనే ఉంది మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.