బ్రేకింగ్: చిరంజీవికి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్! ఏంటో తెలుసా?

Monday, October 14th, 2019, 04:44:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. జగన్ నివాసం లో అడుగుపెట్టిన చిరంజీవి, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ని కలవడం చిరంజీవికి ఇది తొలిసారి. చిరంజీవిని ఎంతో గౌరవంగా ఆహ్వానించిన జగన్ కు చిరంజీవి శాలువా కప్పి గౌరవించారు. చిరంజీవి నటించిన సై రా చిత్రం అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. కాగా ఇటీవలే తెలంగాణ గవర్నర్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపి సై రా చూడాల్సిందిగా కోరిన విషయం అందరికి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి గారి ఇంట్లో లంచ్ సమయం లో కలిసిన చిరు, సై రా చిత్రం గురించి చూడాల్సిందిగా కోరినట్లు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన వీణ బొమ్మ ని బహుమతిగా ఇచ్చారు. ఇంద్ర సినిమా లో చిరంజీవి వీణ స్టెప్ ఇప్పటికీ ఫెమస్సే. అభిమానులు మాత్రం వీణ ని బహుమతి గా ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కలయిక పై ఎన్నో రూమర్స్, అసత్య ప్రచారాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికైనా ప్రతి పక్షాలు రాజకీయాల్ని, సినిమాల్ని వేరుగా చూస్తే బావుంటుందని మెగాస్టార్, జగన్ మోహన్ రెడ్డి అభిమానుల అభిప్రాయం.