మెగాస్టార్ సరసన .. దేవసేన ?

Friday, January 27th, 2017, 11:00:08 PM IST

chiru-anushka
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ”ఖైదీ నంబర్ 150” వ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై దూసుకుపోతుంది. ఇప్పటికే వందకోట్ల మార్కెట్ ని క్రోస్ చేసి మెగాస్టార్ సత్తా చాటిన ఈ సినిమా ఇచ్చిన ఊపుతో మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టాడు. అయన తదుపరి చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మరోపక్క మెగాస్టార్ సరసన అనుష్కను నటింప చేయాలనీ యూనిట్ భావిస్తోందట. అన్నట్టు ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మిస్తాడట. చిరంజీవి 150 వ సినిమా కోసం ఆ మధ్య పలువురు హీరోయిన్స్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో అనుష్క, నయనతార, తమన్నా లాంటి వాళ్ళ పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా కాజల్ ఓకే అయింది ? ఐతే ఈ సారి అలా కాకుండా సినిమా సెట్స్ పైకి రాకముందే హీరోయిన్ ని ఫైనల్ చేయాలనీ ప్లాన్ చేశారట, ఇప్పటికే అనుష్క తో చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. ఇక అనుష్క నటిస్తున్న బాహుబలి 2 కూడా ఎలాగూ పూర్తయింది కాబట్టి ఈ సినిమాకు అనుష్క ఓకే చెప్పే అవకాశాలు చాలా ఉన్నాయ్ !!