చిరుతో ఛాన్స్ ప‌ట్టాలంటే అంత‌కు ముందే..?

Monday, October 16th, 2017, 05:10:02 PM IST

ఆల‌యంలో దైవాన్ని ద‌ర్శించుకోవాలంటే ముందుగా పూజారిని ద‌ర్శించాలి. అదే తీరుగా మెగా కాంపౌండ్ త‌యారైంద‌న్న‌ది ఫిలింన‌గ‌ర్ వార్తాహ‌రులు చెబుతున్న‌ మాట‌. మెగాస్టార్ చిరంజీవికి క‌థ చెప్పి ఒప్పించాలంటే, ముందుగా రామ్ చ‌ర‌ణ్‌ని క‌ల‌వాలి. చెర్రీని క‌లిసి క‌థ వినిపించి ఓకే చేయాలి. ఆ త‌ర్వాతే అవ‌కాశం ద‌క్కేది.

అలా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే.. రామ్‌చ‌రణ్ హీరోగా `ధ్రువ‌` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించాక వెంట‌నే మెగాస్టార్‌తో అవ‌కాశం అందుకున్నాడు సురేంద‌ర్ రెడ్డి. టాలీవుడ్ లోనే మోస్ట్ అవైటెడ్ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు ఇప్పుడు. సైరా-న‌ర‌సింహారెడ్డి ద‌ర్శ‌కుడిగా అత‌డి పేరు మార్మోగిపోతోంది. అయితే ఆ స్థాయి హీరోని డైరెక్ట్ చేయాలంటే ముందు చ‌ర‌ణ్‌ని డైరెక్ట్ చేసి మెప్పించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బోయ‌పాటి సినిమా ప్ర‌క‌టించినా, మ‌ధ్య‌లో చెర్రీతో బోయ‌పాటి ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది. మెగాస్టార్ 152వ సినిమాకి ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటి ఫిక్స‌యినా .. ముందు చెర్రీతో సినిమా చేస్తాడుట‌. ఫిబ్ర‌వ‌రిలో సినిమా ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఈలోగానే సుక్కూతో చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` పూర్తి చేసి బోయ‌పాటికి ట‌చ్‌లోకి వ‌స్తాడుట‌. ఇప్పుడర్థ‌మైంది క‌దూ దైవాన్ని క‌లిసే ముందే పూజారిని ఎందుక క‌ల‌వాలో? ఇక చ‌ర‌ణ్‌-బోయ‌పాటి సినిమాని డివివి దాన‌య్య నిర్మిస్తార‌ని తెలిసింది.