తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు పూర్తి స్థాయిలో వాయిదా పడ్డాయి. చిత్ర నిర్మాణ అనంతర పనులు సైతం ఆగిపోయాయి. అయితే ఈ ప్రక్రియల కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే లాక్ డౌన్ కారణంగా ఆగిన షూటింగ్ లు మళ్లీ మొదలెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కలిశారు.సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్. శంకర్, రాధాకృష్ణ, సి. కళ్యాణ్, సురేష్ బాబు, కొరటాల శివ తో పలువురు భేటీ అయ్యారు.
అయితే జూన్ మొదటి వారం నుండి చిత్రీకరణ కు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తుంది అని కేసీఆర్ తెలిపారు.కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అన్నారు. అయితే వీటికి సంబంధించిన అనుమతి విషయాల పై త్వరలో అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది అని హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ హామీ ఇవ్వడం తో చిరు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు చిరు. వినోద పరిశ్రమ పునః ప్రారంబించి వీది విధానాలను ప్రభుత్వం రూపొందించి అందరికీ మేలు కలిగేలా చేస్తాం అని హామీ ఇచ్చారని వివరించారు.
వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. I wholeheartedly thank Hon'ble CM #KCR garu on behalf of the Film, TV & Digital Media industries for granting a patient hearing & his kind reassurance.🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2020