కాజల్ తో రొమాన్స్ అదరగొట్టిన..మాస్టర్?

Thursday, November 24th, 2016, 11:21:59 PM IST

chiru-and-kajal
అందాల భామ కాజల్ హీరోయిన్ గా ఉంటె .. ఆ సినిమాకు అదో క్రేజ్. ఘాటు అందాలు, క్యూట్ అందాలతో ఆకట్టుకునే ఈ భామతో రొమాన్స్ చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సై అంటారు !! అందుకే ఈ అమ్మడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ .. దూసుకుపోతుంది. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ సరసన ఖైదీ నంబర్ 150 వ సినిమాలో నటిస్తున్న కాజల్, ఈ సినిమాలో ఆమె గ్లామర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఇక చిరంజీవి- కాజల్ నటిస్తున్న ఈ సినిమాలో మన మాస్టర్ కెమిస్టీ బాగా వర్కవుట్ చేసాడట. కాజల్ తో రొమాన్స్ ఓ రేంజ్ లో అదరగొట్టాడు మెగాస్టార్ అని యూనిట్ జోరుగా ప్రచారం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ లో అదరగొట్టడమే కాదు .. రొమాన్స్ లోకూడా కింగే. మరి కాజల్ అయన ఏ రేంజ్ లో రొమాన్స్ చేసాడో చూడాలంటే .. సంక్రాంతి వరకు ఆగాల్సిందే.