మార్నింగ్ సెన్సేషన్ న్యూస్ : చిరు ఒక్క మీటింగ్ ఇంత పని చేసిందా?

Saturday, February 15th, 2020, 07:03:27 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుడు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కలుగజేసుకొని చితికి పోయిన సంగతి అందరికీ తెలిసిందే.అలా చిరు కొన్నాళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉండి తనకి ప్రీతిపాత్రమైన సినిమాల్లోనే మళ్లీ బిజీగా గడుపుతున్నారు.అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం చిరు పై పలు వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు ముందు చిరు ఏ సమయంలో అయినా సరే బీజేపీలో చేరవచ్చని వార్తలు రాగా ఇప్పుడు ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మరికొన్ని వార్తలు ఏపీ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.చిరు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయనకు రాజ్యసభ స్థానం కూడా ఖరారు అయ్యిపోయింది అని టాక్ వినిపిస్తుంది.అయితే దీనంతటికీ కారణం ఒకే ఒక్క మీటింగ్ అని తెలుస్తుంది.

చిరు తాను నటించిన సైరా చిత్రాన్ని చూడమంటూ ఏపీకు కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ ను కలవడం రాజకీయ శ్రేణుల్లో పెద్ద సంచలనం రేపింది.ఈ మీటింగ్ దగ్గర పడ్డ బీజం ఇప్పుడు చెట్టయ్యింది అని విశ్లేషకులు అంటున్నారు.చిరు నిజంగా కలుస్తున్నారో లేదో తెలీదు కానీ వీరికి వీరే చిరును వైసీపీ పార్టీలో చేర్చేసారు.అలాగే మూడు రాజధానులు చిరు మద్దతు ఇచ్చినట్టు ఎక్కడా అధికారిక ప్రకటనలు రాకపోయినా దానిని కూడా దీనికి ముడిపెట్టి చిరు వైసీపీ అరంగేట్రం చెయ్యడం ఖాయమని రకరకాల స్పెక్యులేషన్స్ ప్రచారం చేస్తున్నారు.మరి చిరు ఏమనుకుంటున్నారో ఆయనకే తెలియాలి.