`చిత్రాంగ‌ద‌`కు ఎట్ట‌కేల‌కు డేట్ ఫిక్స్

Tuesday, January 24th, 2017, 08:32:43 PM IST

anjali
తెలుగు హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న `చిత్రాంగద` చిత్రానికి ఎట్ట‌కేల‌కు మోక్షం క‌లిగింది. మూడేళ్ల క్రితం మొద‌లైన సినిమా అనివార్య కార‌ణాల వ‌ల్ల డిలే అయిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ కు నిర్మాత‌లు డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో యూనిట్ సినిమా క‌థ‌ను కూడా రివీల్ చేసింది.

అంజ‌లి టైటిల్ పాత్రలో ఆమె అభినయం సినిమాను పీక్స్ కు తీసుకెళ్తుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న అంశాల‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తూ తెర‌కెక్కించారు. కథానుగుణంగా ఆమెరికాలోని అందమైన లొకేషన్స్ కీలక స‌న్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పటి వరకు అంజలిని తన కెరీర్‌లో చేయనటువంటి విభిన్నమైన పాత్రను చిత్రాంగదలో పోషించింద‌ని తెలిపింది యూనిట్.