ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వేలం ప్రారంభమైపోయింది. ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. అయితే సౌతాఫ్రికా బౌలర్ క్రిస్ మోరిస్ ఈ సారి ఏకంగా రూ.16.25 కోట్ల ధర పలికి అందరికి ఒకింత షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 13 సార్లు వేలం జరగగా ఇందులో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ టాప్‌లో ఉన్నాడు. 2015లో యువీనీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు రూ.16 కోట్లు వెచ్చించి కొనుక్కుంది.
అయితే కేవలం రూ.75 లక్షల బేస్ ధరతో వేలంలో నిలిచిన క్రిస్ మోరిస్‌ను రూ.16.25 కోట్ల పెద్ద మొత్తంలో వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది. ఇదిలా ఉంటే మోరిస్ కోసం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు పోటాపోటాగా తలపడ్డాయి. గతేడాది మోరిస్‌ను రూ.10 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు ఈ ఏడాది విడిచిపెట్టేసింది. అయితే మళ్లీ అతడిని దక్కించుకునేందుకు ప్రయత్నించినా చివరకు రాజస్థాన్ అతడిని చేజిక్కిచ్చుకుంది.