ఈసారి ఆస్కార్ క్రిస్టోఫ‌ర్ నోలాన్‌కే!!

Thursday, January 25th, 2018, 10:57:33 AM IST

2018 ఆస్కార్ పుర‌స్కారాలకు వేళ‌యింది. ఈ మార్చిలోనే అవార్డుల కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టికే వీటికి సంబంధించిన హంగామా మొద‌లైంది. ప్ర‌పంచ‌వ్యాప్త సినిమాల‌న్నిటినీ వీక్షిస్తున్న ఆస్కార్ క‌మిటీ నామినేష‌న్ సినిమాల వివ‌రాలు వెల్ల‌డించింది. అయితే వీటిలో ఈసారి ఉత్త‌మ ద‌ర్శ‌కుడు విభాగంలో ఎవ‌రికి అవార్డు ద‌క్కుతుంది? అన్న ఆస‌క్తి అంద‌రిని నిలువ‌నీయ‌డం లేదు. దీనిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈసారి `డ‌న్‌కిర్క్‌` ద‌ర్శ‌కుడు క్రిస్టోఫ‌ర్ నోలాన్‌కి ఆస్కార్ ద‌క్క‌డం ఖాయం అన్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. గ‌త ఏడాది రిలీజైన వార్ బ్యాక్‌డ్రాప్ సినిమా డ‌న్ కిర్క్‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లొచ్చాయి. ప‌లు అవార్డు వేడుక‌ల్లో అవార్డులు కొల్ల‌గొట్టింది ఈ చిత్రం. సాంకేతికంగా అత్యున్న‌త చిత్రంగా పేరొచ్చింది. అందుకే ఈసారి నోలాన్‌కి ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డు రావ‌డం ఖాయం అన్న చ‌ర్చ సాగుతోంది. అయితే నోలాన్‌తో పాటు.. జోర్డాన్ పీలే `గెట్ ఔట్‌`, గ్రేట్ గేర్‌విగ్ `లేడి బ‌ర్డ్‌`, పాల్ థామ‌స్ `పాంఠ‌మ్ థ్రెడ్‌`, గులెర్మో డెల్ టారో `ది షేప్ ఆఫ్ వాట‌ర్‌`.. వంటి ద‌ర్శ‌కులు పోటీలో ఉన్నారు. వీళ్ల సినిమాలు త‌క్కువేమీ కాదు. సాంకేతికంగా హై స్టాండార్డ్స్ సినిమాలే.

అయితే ఇన్‌సెప్ష‌న్‌, మెమెంటో, ది డార్క్ నైట్ గ్రేట్ వంటి గ్రేట్ సినిమాలు తెర‌కెక్కించిన నోలాన్ ఇప్ప‌టివ‌ర‌కూ ఆస్కార్ అందుకోలేదు స‌రిక‌దా.. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేట‌గిరీకి అర్హ‌త సాధించ‌నేలేదు. డ‌న్‌కిర్క్‌తో అరుదైన అవ‌కాశం వ‌చ్చింది. ఈసారి అత‌డికి అవార్డు ఖాయం అన్న టాక్ అత‌డిలో ఉత్సాహం నింపుతోంది. ఆస‌క్తిక‌రంగా నోలాన్ భార్య గ‌తంలో `వ‌ర‌ల్డ్ వార్ 11`చిత్రం ఉత్త‌మ చిత్రంగా ఆస్కార్ అందుకుంది. మార్చి 4న ఆస్కార్ 90వ పుర‌స్కారాలు అందించ‌నున్నారు. మార్చి 5న స్టార్ మూవీస్‌లో ఈ కార్య‌క్ర‌మం లైవ్ కానుంది.