అతని దగ్గర రహస్యం ఉందా.. కరుణాకర్ రెడ్డిని వదలని సిఐడి..?

Saturday, September 17th, 2016, 04:58:40 PM IST

karunakar-reddy
కాపు గర్జన సందర్భంగా తునిలో జరిగిన విధ్వంస కాండకు సంబంధించి రెండవసారి మాజీ ఎమ్మెల్యే , వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి నుంచి నోటీసులు అందుకున్నారు.సిఐడి ఈ నోటీసులో ఈ నెల 19 న గుంటూరు లో విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

భూమాన కరుణాకర్ రెడ్డి తోపాటు కాకినాడలో ఉంటున్న ఆయన సన్నిహితుడు మెహర్ కు కూడా సిఐడి నోటీసులు జారీ చేయడం విశేషం.ఇటీవల కొని రోజులక్రితం సిఐడి భుమన ని సిఐడి సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.కాగా మరల సిఐడి భూమన ని విచారణకు ఆదేశించడం పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. సిఐడి ఈ కేసులో ఏమైనా ఆధారాలు సంపాదించిందా ? లేక ఈ కేసు విషయం లో మరిన్ని విషయాలను భూమన ద్వారా రాబట్టే ప్రయత్నం చేస్తోందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.