బిగ్ న్యూస్: దేవినేని ఉమా కి మరొకసారి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు!

Friday, April 30th, 2021, 02:12:50 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కి మరొకసారి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ అభియోగాలు పై అధికారులు నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే గురువారం మంగళగిరి లోని సీఐడీ కార్యాలయం లో అధికారులు 9 గంటల పాటు దేవినేని ఉమా ను విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణ లో ఉమా కి పలు ప్రశ్నలను సంధించారు అధికారులు. అయితే దేవినేని ఉమా ప్రెస్ మీట్ లో ఉపయోగించిన సెల్ ఫోన్ మరియు టాబ్ లు ఎక్కడ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే మే 1 వ తేదీన ఉదయం 11 గంటలకు మరొకసారి విచారణకు హాజరు కావాలి అంటూ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. దేవినేని ఉమా ఇచ్చిన వివరణ తో అధికారులు ఏ మాత్రం కూడా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అయితే దేవినేని ఉమా పై జరుగుతున్న విచారణ పట్ల ఒక పక్క టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా చేస్తున్నారు అని అధికార పార్టీ వైసీపీ పై ఆరోపిస్తున్నారు.