కంగారు పెడుతున్న ‘కాటమరాయుడు’..!

Friday, September 23rd, 2016, 01:35:06 PM IST

katamarayudu
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రంలో ట్విస్ట్ లు ఎలాఉంటాయో తెలియదుకాని.. ప్రొడక్షన్ దశలోనే పవన్ ఊచించని ట్విస్ట్ లు ఇస్తున్నాడు.తాజాసమాచారం ప్రకారం ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మారాడని తెలుస్తోంది.ఈ చిత్రానికి మొదట బెంగాల్ టైగర్ కు పనిచేసిన సౌందర రాజన్ ను అనుకున్నారు. చిత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాక పోవడంతో అతను తప్పుకున్నాడని తెలుస్తోంది.

అత్తారింటికి దారేది చిత్రానికి పనిచేసిన ప్రసాద్ మురెళ్ళను తీసుకున్నారని తెలుస్తోంది.అత్తారింటికి దారేది చిత్రం పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదట ఈ చిత్రానికి డైరెక్టర్ గా ఎస్ జె సూర్య ని అనుకున్నారు.కానీ చిత్రం పట్టాలెక్క బోతున్న సమయానికి ఆయన తప్పుకున్నాడు.ఇప్పుడు ఈ చిత్రాన్ని డాలి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనా ఇంతవరకు అపవాన్ షూటింగ్ లో పాల్గొనలేదు.డాలి ఇతర నటులపై వచ్చే సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. పవన్ ఈ నెల 24 నుంచి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.